ప్రభుత్వ పథకాలు & ఉద్యోగాలతాజా సమాచారం కోోసం
తాజా AP & TS పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ వెంటనే పొందండి.
తల్లికి వందనం డబ్బులు ఇంకా రాని వారు గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకునే విధానం | Thalliki Vandanam Grievance 2026
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న Thalliki Vandanam Grievance 2026 ప్రక్రియలో అర్హులైన పలువురు లబ్ధిదారులు సాంకేతిక కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డేటా వ్యత్యాసాలు, NPCI లింకింగ్ సమస్యలు, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ లోపాలు, Mother Demised వంటి కారణాలతో కొందరి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా సరైన గ్రీవెన్స్ నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Thalliki Vandanam Grievance 2026 పరిష్కారాల కోసం విద్యాశాఖ, NBM పోర్టల్, UDISE+ డేటా ఆధారంగా అధికారిక మార్గదర్శకాలను విడుదల చేసింది. Income Tax ఫ్లాగ్ తొలగిపోయినా Ineligible చూపించడం, “NOT IN TV DATASET”, “No Data Found”, “Data Wrong” వంటి సమస్యలకు వేర్వేరు పరిష్కారాలు ఉన్నాయి. సరైన గ్రీవెన్స్ కేటగిరీని ఎంచుకుంటే మాత్రమే దరఖాస్తు వేగంగా పరిశీలించే అవకాశం ఉంటుంది.
Thalliki Vandanam Grievance 2026: ప్రధాన సమస్యలు & అధికారిక పరిష్కారాలు
| సమస్య | అధికారిక పరిష్కారం |
|---|---|
| Income Tax క్లియర్ అయినా Ineligible | శాఖ స్వయంగా డేటా అప్డేట్ చేస్తుంది |
| Mother Demised | SED వెరిఫికేషన్ అనంతరం సవరణ |
| No Data Found | శాఖ డేటా నవీకరణ తర్వాత పరిష్కారం |
| Student & Mother HH Mapping సమస్య | Welfare Login ద్వారా వెరిఫికేషన్ |
| NOT IN TV DATASET | Details Not Found గ్రీవెన్స్ నమోదు చేయాలి |
| Mother Data తప్పుగా ఉండటం | Data Wrong కేటగిరీ ఎంచుకోవాలి |
| Rice Card ఉన్నా అనర్హత | శాఖ నేరుగా పరిశీలిస్తుంది |
| Govt Employee తప్పుగా చూపించడం | Eligibility మళ్లీ రన్ చేస్తారు |
| Four Wheeler ఆప్షన్ లేకపోవడం | ప్రత్యేక గ్రీవెన్స్ అవసరం లేదు |
| ఇద్దరు పిల్లలకు ఒకే సమస్య | ఒక్క విద్యార్థికి గ్రీవెన్స్ నమోదు చేస్తే సరిపోతుంది |
గ్రీవెన్స్ నమోదు చేసే విధానం
Thalliki Vandanam Grievance 2026 కోసం ముందుగా సచివాలయం/NBM పోర్టల్‌లో లాగిన్ కావాలి. తర్వాత విద్యార్థి లేదా తల్లి వివరాలను శోధించి సమస్యకు అనుగుణంగా Data Wrong లేదా Details Not Found కేటగిరీని ఎంచుకోవాలి. అవసరమైన ఆధారాలు జతచేసి దరఖాస్తు సమర్పిస్తే సంబంధిత శాఖ పరిశీలించి అప్డేట్ చేస్తుంది. Mother Demised, NPCI Seeding, HH Mapping వంటి కేసుల్లో సరైన వివరాలు నమోదు చేయడం అత్యంత ముఖ్యమని అధికారులు సూచిస్తున్నారు.
Official Authority Sources
| Authority / Department | Purpose | Official Link |
|---|---|---|
| Department of School Education, Andhra Pradesh | School Education Department | School Education Department AP |
| Government of Andhra Pradesh | Official State Government Portal | Government of Andhra Pradesh |
| NBM Official Portal | NBM Services & Scheme Portal | NBM Official Portal |
| BM (Beneficiary Management) Portal | BM Portal Login / Beneficiary Management | BM Portal |
| UDISE+ Portal | School & Student Database | UDISE+ Official Portal |
| S.No | సమస్య (Issue) | అధికారిక పరిష్కారం (Official Solution) |
|---|---|---|
| 1 | Six-Step Validation ద్వారా Income Tax ఫ్లాగ్ తొలగిపోయినా Child ఇంకా Ineligible Listలో కనిపించడం, IT ఆప్షన్ లేకపోవడం. | ప్రత్యేక గ్రీవెన్స్ అవసరం లేదు. సంబంధిత శాఖ నేరుగా డేటాను సరిచేస్తుంది. |
| 2 | తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన (Parents Demised) సందర్భంలో Mother Demised కారణంగా Ineligible చూపించడం. | School Education Department (SED) వెరిఫికేషన్ అనంతరం డేటాను అప్డేట్ చేస్తుంది. |
| 3 | తల్లి మరణించిన తర్వాత తండ్రి వివరాలతో గ్రీవెన్స్ నమోదు చేస్తే No Data Found చూపించడం. | SED పరిశీలనలో ఉంది. డేటా నవీకరణ అనంతరం సమస్య పరిష్కరించబడుతుంది. |
| 4 | Student మరియు Mother ఒకే Household Mappingలో ఉన్నప్పటికీ UIDs Not In Same HH అని చూపించడం. | Welfare Loginలో Verification పూర్తి చేసి పంపాలి. అనంతరం శాఖ చర్యలు తీసుకుంటుంది. |
| 5 | SED డేటాలో Mother వివరాలు NAగా ఉండటం వల్ల Household Mapping సమస్య రావడం. | Data Wrong కేటగిరీలో గ్రీవెన్స్ నమోదు చేయాలి. |
| 6 | NOT IN TV DATASET కారణంగా అర్హులైన విద్యార్థులకు పథకం ప్రయోజనం అందకపోవడం. | Details Not Found ఆప్షన్ ద్వారా గ్రీవెన్స్ నమోదు చేయాలి. |
| 7 | Intermediate First Year విద్యార్థుల వివరాలు లేకపోవడం లేదా అమౌంట్ జమ కాకపోవడం. | Verification List పరిశీలించి అవసరమైతే Details Not Found కింద దరఖాస్తు చేయాలి. |
| 8 | School Dataలో తప్పు Mother వివరాలు ఉండటం వల్ల UIDs Not In Same HH Error రావడం. | School Education Department ద్వారా మాత్రమే డేటా సవరించబడుతుంది. |
| 9 | School Listలో మరో Child వివరాలు రావడం లేదా NPCI సమస్య చూపించడం. | Data Wrong కేటగిరీ ఎంచుకుని సరైన Mother వివరాలు నమోదు చేయాలి. |
| 10 | ఒకే Motherకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరికి మాత్రమే Grievెన్స్ నమోదు అవ్వడం. | ఒక్క Childకు మాత్రమే Grievెన్స్ నమోదు చేస్తే సరిపోతుంది. |
| 11 | Grievెన్స్ నమోదు సమయంలో Four Wheeler ఆప్షన్ కనిపించకపోవడం. | ఈ అంశానికి ప్రత్యేక Service Request అవసరం లేదు. |
| 12 | Rice Card ఉన్నప్పటికీ Not Having Rice Card అని చూపించడం లేదా No Data Found రావడం. | సంబంధిత శాఖ నేరుగా డేటాను పరిశీలించి సరిచేస్తుంది. |
| 13 | Mother స్థానంలో Father వివరాలు రావడం లేదా Father NPCI Inactive ఉండటం. | Data Wrong కేటగిరీలో సరైన Mother వివరాలు నమోదు చేయాలి. |
| 14 | Govt Employee కాకపోయినా Government Employeeగా చూపించి Ineligible చేయడం. | Eligibility Parameters మళ్లీ Run చేసి శాఖ డేటాను సరిచేస్తుంది. |
| 15 | Navodaya విద్యార్థుల 11 Digit PEN ID Portalలో నమోదు కాకపోవడం. | BM Portalలో త్వరలో కొత్త Provision అందుబాటులోకి తీసుకురానున్నారు. |
👉 Andhra Pradesh Govt Schemes – CLick Here
👉 Telangana Govt Schemes – CLick Here
👉 Central Govt Schemes – CLick Here
ప్రభుత్వ పథకాలు & ఉద్యోగాలతాజా సమాచారం కోోసం
తాజా AP & TS పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ వెంటనే పొందండి.








