ప్రభుత్వ పథకాలు & ఉద్యోగాలతాజా సమాచారం కోోసం
తాజా AP & TS పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ వెంటనే పొందండి.
మహిళల స్వయం ఉపాధికి ప్రభుత్వం చేయూత.. తక్కువ వడ్డీతో ఎలక్ట్రిక్ ఆటోలు, ఈ-బైక్లకు రుణాలు
Electric Auto Loan for Women పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్త్రీనిధి ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలు, ఈ-బైక్ల కొనుగోలుకు తక్కువ వడ్డీపై రుణాలు అందించనుంది. మహిళల ఆర్థిక స్వావలంబనతో పాటు పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
Electric Auto Loan for Women ద్వారా లభించే రుణాలు
ప్రస్తుతం ఇంధన ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో Electric Auto Loan for Women ద్వారా ఈ-ప్యాసింజర్ ఆటోలకు రూ.2.74 లక్షల నుంచి రూ.3.13 లక్షల వరకు, ఎలక్ట్రిక్ బైక్లకు రూ.1 లక్ష వరకు రుణం అందించనున్నారు. ఈ రుణాలను సులభ వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించడంతో మహిళలు అధిక వడ్డీతో ప్రైవేట్ అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు.
| రుణ వివరాలు | ప్రయోజనం |
|---|---|
| ఈ-ప్యాసింజర్ ఆటో | రూ.2.74 లక్షలు వరకు |
| ఈ-ట్రాలీ ఆటో | రూ.3.13 లక్షలు వరకు |
| ఎలక్ట్రిక్ బైక్ | రూ.1 లక్ష వరకు |
| ఆటో రుణ కాలం | 60 నెలలు |
| ఆటో వడ్డీ | వార్షిక 11% |
| బైక్ రుణ కాలం | 48 నెలలు |
ఈ పథకం ద్వారా మహిళలు ఈ-ఆటోలను ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా, స్థానిక సేవలకు వినియోగించి స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ బైక్లను డెలివరీ సేవలు, ఫీల్డ్ వర్క్, చిన్న వ్యాపారాలు, ఆన్లైన్ సేవల కోసం ఉపయోగించి అదనపు ఉపాధిని కూడా పొందవచ్చు. Electric Auto Loan for Women పథకం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలకు దోహదం చేయనుంది.
👉 విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త!.. విద్యార్థులకు వరుస సెలవులు.. 8, 9, 10 తేదీల్లో మూడు రోజుల హాలిడే!
👉 రూ.6 లక్షలకే సొంత ఇల్లు.. దరఖాస్తుకు ఇంకా 4 రోజులే!
👉 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాల గ్రీవెన్స్ అప్లై విధానం
👉 ఆగస్టు 15 నుంచి 1.05 కోట్ల కొత్త PDS రేషన్ కార్డుల పంపిణీ
ఒక ఈ-ప్యాసింజర్ ఆటోలో ఐదుగురు ప్రయాణించగలరు. రోజుకు సుమారు రెండు గంటలు ఛార్జింగ్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. Electric Auto Loan for Women ద్వారా కార్బన్ ఉద్గారాల తగ్గింపు, పరిశుభ్రమైన పర్యావరణం, మహిళల ఆదాయ పెరుగుదల, కుటుంబాల ఆర్థిక బలోపేతం వంటి పలు ప్రయోజనాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. అర్హులైన మహిళలకు త్వరలోనే రుణాల మంజూరు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది.
ప్రభుత్వ పథకాలు & ఉద్యోగాలతాజా సమాచారం కోోసం
తాజా AP & TS పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ వెంటనే పొందండి.








