ప్రభుత్వ పథకాలు & ఉద్యోగాలతాజా సమాచారం కోోసం
తాజా AP & TS పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ వెంటనే పొందండి.
Draft Voter List SIR 2026: నేడే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. మీ పేరు వెంటనే చెక్ చేసుకోండి
Draft Voter List SIR 2026 కింద కేంద్ర ఎన్నికల సంఘం నేడు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR 2026) ప్రక్రియ పూర్తిచేసిన అనంతరం అర్హులైన ఓటర్ల వివరాలను జాబితాలో చేర్చగా, అనర్హులుగా గుర్తించిన పేర్లను తొలగింపు జాబితాలో ఉంచింది. అందువల్ల ప్రతి ఓటరు Draft Voter List SIR 2026లో తమ పేరు తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.
Draft Voter List SIR 2026 ముఖ్యాంశాలు
SIR 2026 పరిశీలనలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్ల వివరాలను పరిశీలించారు. ఇందులో 3,71,38,206 మంది అర్హుల వివరాలతో ముసాయిదా జాబితా సిద్ధమైంది. మరోవైపు 44,89,488 పేర్లు అందుబాటులో లేకపోవడం, శాశ్వతంగా వలస వెళ్లడం, డూప్లికేట్ నమోదు లేదా మరణించిన వారి పేర్లు కావడం వంటి కారణాలతో తొలగింపు జాబితాలో చేర్చారు. Draft Voter List SIR 2026లో మీ పేరు లేకపోయినా లేదా వివరాల్లో తప్పులు ఉన్నా ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
| ప్రక్రియ | తేదీ |
|---|---|
| ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల | నేడు |
| క్లెయిమ్స్ & అభ్యంతరాలు | ఆగస్టు 31 వరకు |
| దరఖాస్తుల పరిశీలన | ఆగస్టు 31 – సెప్టెంబర్ 28 |
| తుది ఓటర్ల జాబితా | అక్టోబర్ 3 |
కొత్త ఓటు నమోదు, చిరునామా మార్పు, పేరు లేదా ఇతర వివరాల సవరణ కోసం పౌరులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక పోర్టల్ లేదా స్థానిక బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) ద్వారా Draft Voter List SIR 2026ను పరిశీలించి అవసరమైన మార్పులు నమోదు చేయాలని ఎన్నికల అధికారులు సూచించారు.
👉 మహిళలకు భారీ గుడ్ న్యూస్.. 80% సబ్సిడీతో స్కూటర్లు.. ఆగస్టు 20లోపు తుది ఎంపిక
👉 రైతుల ఖాతాల్లోకి మళ్లీ రూ.2,000.. 24వ విడత ఎప్పుడు? పూర్తి వివరాలు
👉 తల్లికి వందనం డబ్బులు ఇంకా రాని వారు గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకునే విధానం
మ్యాపింగ్ పూర్తికాని ఓటర్లకు ప్రత్యేక నోటీసులు జారీ చేయనున్నారు. అలాంటి వారు ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించి తమ అర్హతను నిర్ధారించుకోవాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారి పేర్లు అక్టోబర్ 3న విడుదలయ్యే తుది జాబితాలో చేర్చబడతాయి. అందువల్ల Draft Voter List SIR 2026లో మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో వెంటనే చెక్ చేసుకోవడం మంచిది.
Official Authority Sources
These are the official Election Commission of India resources for SIR 2026, voter list verification, voter registration, corrections, and electoral roll search.
ప్రభుత్వ పథకాలు & ఉద్యోగాలతాజా సమాచారం కోోసం
తాజా AP & TS పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ వెంటనే పొందండి.








